ఆంధ్రప్రదేశ్‌

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: వివిధ ప్రభుత్వశాఖల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వీటిలో 50శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. ఈ ప్రక్రియ అమలుకు వీలుగా ఒక కార్పొరేషన్ రాష్టస్థ్రాయిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో అవకాశాలు అందరికీ దక్కకపోవటం, పనికి తగిన వేతనం లభించకపోవటం వంటి ఇబ్బందులను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించేందుకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాధారణ పరిపాలన పర్యవేక్షణలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. డిసెంబర్ 1 నుంచి ఈ కార్పొరేషన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఈ కార్పొరేషన్‌కు అనుబంధంగా విభాగాలు ఏర్పాటు చేస్తారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు వీటికి నేతృత్వం వహిస్తారు.