ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంకు మళ్లీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, అక్టోబర్ 9: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహాక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం మళ్లీ మొదలైంది. డ్యామ్ నీటిమట్టం 885 అడుగులకు చేరుకోవడంతో బుధవారం సాయంత్రం ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటి విడుదలను జలవనరులశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ ఏడాది 5వ సారి శ్రీశైలం జలాశయం గేట్లు తెరచి నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 45,190 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 35,568 క్యూసెక్కులు కలిపి మొత్తం 80,760 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం చేరింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 884.90 అడుగులు కాగా 215.32 టీఎంసీల నీరు నిల్వ ఉంది.