ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయులకు సమాజంలో సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 9: సమాజంలో ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పేర్కొన్నారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులోని సిద్ధార్థగార్డెన్స్‌లో ఉపాధ్యాయులకు గురు పురస్కారాలు, సత్కారాలు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల సభ ఫౌండేషన్ కన్వీనర్, జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యావ్యవస్థలో నేడు మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువుల రుణం తీర్చుకోలేనిదన్నారు. రాబోయే తరం విద్యార్థులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ తండ్రి రామినేని అయ్యన్నచౌదరి ఆశయాల సాధన కోసం వారి పేరిట ఫౌండేషన్‌ను స్థాపించి, గత రెండు దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న కుమారులు ధర్మప్రచారక్, సత్యవాది, వేదాచార్య, బ్రహ్మానందం అభినందనీయులన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించిందన్నారు. ఈ రంగం అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అయ్యన్న సేవలు ఎనలేనివి: కన్నా
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లిన అయ్యన్నచౌదరి సొంత జిల్లా రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతో చేసిన కృషి ఎనలేనిదన్నారు. అనంతరం 106 మంది ప్రధానోపాధ్యాయులకు గురు పురస్కారాలు, 84 మంది ఉపాధ్యాయులకు గురుసన్మానం, 268 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అతిథుల చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...గురు పురస్కారాలు అందజేస్తున్న కపిల్‌దేవ్, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు