ఆంధ్రప్రదేశ్‌

వైకాపా గూటికి ఆకుల, జూపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 9: మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బీజేపీ తరుఫున గెలిచిన ఆకుల బీజేపీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరి, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా జూపూడి ప్రభాకర్‌రావు 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ప్రస్తుతం సొంత గూటికి చేరుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ మేనిఫెస్టో అనేది ఎన్నికల వరకే పరిమితం కారాదని, అది ఓ పవిత్ర గ్రంథంగా భావించాలనే సీఎం జగన్ అంకిత భావం పట్ల ఆకర్షితుడినై పార్టీలో చేరానని చెప్పారు. వాహన మిత్ర, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వంటి పారదర్శక విధానాలు, ప్రజోపయోగ సంక్షేమ పథకాలతో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. కౌలు రైతులకు సైతం రుణ సదుపాయం కల్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాల అమలుకు దృఢచిత్తంతో ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తమవంతు భాగస్వామ్యం అందించేందుకు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దశలవారీ మద్య నిషేధ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకే సామాన్య కార్యకర్తగా తాను వైకాపాలో పునఃప్రవేశం చేసినట్లు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధిని కోరుకునే వారు విమర్శించాల్సిన సమయం ఇది కాదన్నారు. 50 శాతం పైగా ఓటర్లు ఆదరించిన జగన్ రాజన్న పాలన తెస్తాడనే నమ్మకంతో ఉన్నానన్నారు. టీడీపీలో ఉన్నా ప్రజా నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అన్నారు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతున్న ముఖ్యమంత్రి అంకిత భావమే రాష్ట్ర అభివృద్ధికి కొలమానమన్నారు. నాయకులంతా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. నవరత్నాలు, శాసనసభలో సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లులు, చట్ట సవరణలతో నిరుపేద, సామాన్య వర్గాలకు భరోసా కల్పించారన్నారు. తాను పార్టీలో చేరేందుకు ఎలాంటి షరతులు లేవన్నారు. టీడీపీకి రాజీనామా రిజిస్టర్ పోస్టులో పార్టీ అధినేతకు పంపానని చెప్పారు. గతంలో తన వైపు నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయని వాటిని సరిదిద్దుకుని సీఎం జగన్ అడుగులో అడుగేస్తామని స్పష్టం చేశారు. కాగా ఆకుల సత్యనారాయణతో పాటు పీసీసీ కార్యదర్శి దాసు వెంక్రటావు జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
*చిత్రం...సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జూపూడి, ఆకుల సత్యనారాయణ