ఆంధ్రప్రదేశ్‌

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచిలి, అక్టోబర్ 10: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలోని బాలయోగి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ నివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రిన్సిపాల్ బాలాజీతోపాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసారు. ఇచ్ఛాపురం వెళ్తున్న కలెక్టర్ ఆకస్మికంగా కంచిలి ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డిని గురుకుల పాఠశాల ఎక్కడ అని ప్రశ్నించి అక్కడకు వెళ్లారు. అదే సమయానికి విద్యార్థులు భోజనానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థుల కంచాల్లో ఉన్న ఆహార పదార్థాల్లో కూర లేకపోవడంతో ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించగా కలెక్టర్ ఆగ్రహాం వ్యక్తం చేసి ఉపాధ్యాయులు విద్యార్థులతో భోజనాలు చేయకపోవడానికి గల కారణాలు ఏమి అని ప్రశ్నిస్తూ ప్రిన్సిపాల్‌తోపాటు ఉపాధ్యాయులు పీవీ రమణ, జయరాం, అమ్మాయమ్మ, సురేషు, శ్రీనివాసరావులను అక్కడక్కడే సస్పెండ్ చేసారు. విద్యార్థులకు భోజనాల్లో అన్నంతోపాటు పప్పు, కూర ఉండాల్సి ఉన్నప్పటికీ కేవలం అన్నం, పప్పు మాత్రమే పెట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పాఠశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మండిపడ్డారు.

*చిత్రం...బాలయోగి గురుకుల పాఠశాల డైనింగ్ హాల్ బయట రికార్డులు తనిఖీ చేస్తున్న కలెక్టర్ నివాస్