ఆంధ్రప్రదేశ్‌

14న జగన్‌తో చిరంజీవి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో సినీ నటుడు చిరంజీవి ఈ నెల 14న భేటీ కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు కలువనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిని వీక్షించేందుకు రావాల్సిందిగా సీఎంను కోరనున్నారు. తొలితరం స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రానికి సంబంధించి ఈ భేటీ జరగనుంది. ముందుగా అనుకున్న ప్రకారం శుక్రవారం ఈ భేటీ జరగాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.