ఆంధ్రప్రదేశ్‌

జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 11: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో లక్ష్యాలను అధిగమించాలని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్టీ రిటన్స్ ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులపై ఈ సందర్భంగా చర్చించారు. గత నాలుగేళ్లుగా జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లో ఉందని, అయితే ఈ ఏడాది మూడు త్రైమాశికాల నుంచి వసూళ్లు మందగించాయన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ తక్కువగా ఉందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ, ఎక్సైజ్‌శాఖల ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాంబశివరావు, జీఎస్టీ చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, ప్రిన్సిపల్ కమిషనర్ ఎస్ ఫహీమ్ అహ్మద్ పాల్గొన్నారు.