ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ‘కొల్లు’ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 12: నూతన ఇసుక విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన 36 గంటల నిరవధిక దీక్ష శనివారం రాత్రి ముగిసింది. జిల్లా కేంద్రం మచిలీపట్నం కోనేరుసెంటరులో శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య 36 గంటల నిరవధిక నిరసన దీక్షకు దిగిన కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయటంతో ఆయన తన ఇంటి వద్ద దీక్షను కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మచిలీపట్నంలో సమావేశమైన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు సమావేశానంతరం నేరుగా రవీంద్ర ఇంటికి వెళ్లి ఓ భవన నిర్మాణ కార్మికుడితో నిమ్మరసం ఇప్పించి దీక్షను విరమింప చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నేతృత్వంలో మాజీ మంత్రి
దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, నల్లగట్ల స్వామిదాసు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హిదయతుల్లా, తదితర ముఖ్య నేతలు రవీంద్ర చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత విధానాలపై మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో రవీంద్ర చేపట్టిన నిరవధిక నిరసన దీక్షను భగ్నం చేసేందుకు అధికార పార్టీ చేసిన కుట్రలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కాగా కొల్లు దీక్షకు భవన నిర్మాణ కార్మికుల నుండి మంచి స్పందన లభించింది.

*చిత్రం... కొల్లు రవీంద్రకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేస్తున్న భవన నిర్మాణ కార్మికుడు