ఆంధ్రప్రదేశ్‌

వృత్తిదారులకు ప్రత్యేక పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : రాష్ట్రంలో వెనుకబడిన కులాలతో పాటు వృత్తిదారులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేయబోతుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. మంత్రి ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పాత్రికేయులతో కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీసీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం బీసీలను ఆర్థికంగా ఆదుకోవడానికి నిధులు కేటాయించినా, వాటిని అరకొరగానే ఖర్చు చేసిందని, ముఖ్యంగా బీసీ సబ్ ప్లాన్ కింద రూ. 10వేల కోట్లు ఉన్నా ఉపయోగించుకోలేదని విమర్శించారు. ఎన్నికల సంవత్సరంలో రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. గతంలో ఆదరణ పథకం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసిందేకానీ నాణ్యమైన పరికరాలు కానీ వృత్తి సామగ్రి కానీ ఇవ్వలేదని, కేవలం అధిక ధరలకు కోట్ చేసి దోచుకున్నారని ఆరోపించారు. చేనేతలకు రూ. 4వేల నుంచి రూ. 5వేలు ఖర్చయ్యే సామగ్రిని రూ. 25వేలకు కొనుగోలు చేసి అందజేశారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం బీసీ సబ్‌ప్లాన్ కింద రూ. 15,610 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో వృత్తిదారులకు ఏటా రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఓబీబీఎంఎస్ ద్వారా నమోదు చేసుకోవాలని, ఇప్పటి వరకూ 80వేల మంది
నారుూ బ్రాహ్మణులు, 3.8 లక్షల మంది రజకులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. నూతన పథకాలు, వాటి పేర్లు, ప్రారంభ తేదీని త్వరలో జరగనున్న 16వ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ప్రకటిస్తామన్నారు.
కాగా ఇప్పటికే బీసీలుగా ఉన్న రజకులు, నారుూబ్రాహ్మణులతో పాటు టైలరింగ్‌పై పూర్తిగా ఆధారపడిన అన్ని కులాల వృత్తిదారులకూ కొత్త పథకం వర్తింపజేస్తామన్నారు. వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం కింద రూ. 400 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అయితే ఇప్పటి వరకూ రూ. 117 కోట్లు మాత్రమే పంపిణీ చేశామని, ఇంకా అర్హుల గుర్తింపు కొనసాగుతోందని, వారందరికీ రూ. 10వేలు సాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బీసీ సంక్షేమానికి కేటాయించిన రూ. 1433 కోట్ల నిధులను ఇతర శాఖలకు మళ్లించారని, పసుపు-కుంకుమ పథకానికి ఆ నిధులను వాడేసి బీసీలను అధోగతిపాలు చేశారని ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 2వేల కోట్లు కేటాయించి కేవలం రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేసి కాపులను టీడీపీ ప్రభుత్వం దగా చేసిందన్నారు.

*చిత్రం...రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ