ఆంధ్రప్రదేశ్‌

రివర్స్ కాదు.. రిజర్వ్ టెండరింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 14: పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేపట్టారని, ఒకే వ్యక్తికి పనులు అప్పగించేందుకే రివర్స్ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్‌పై తమకెలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌పై జగన్మోహన్‌రెడ్డి పెత్తనమేందని ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో సోమవారం జరిగిన జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ప్రత్యేక హోదాను గురించి ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. మద్యం ధరలను విపరీతంగా పెంచారన్నారు. జెఎస్‌టీ చూసి ప్రేరణపొందిన స్థానిక వైసీపీ నాయకులు ఎల్‌ఎస్‌టీ మొదలు పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం గోదావరి నీళ్లు తెలంగాణ మీదుగా శ్రీశైలంకు తరలించాలని ప్రయత్నిస్తూ లక్షల కోట్లు వెనకేసుకునేందుకు జగన్, కేసీఆర్‌లు స్కెచ్ వేసుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్టీ పదవుల్లో 33 శాతం ఇకపై మహిళలకు, యువతకు కేటాయించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తమ కార్యకర్తల జోలికి కాదని దమ్ముంటే తమ నేతల జోలికి రావాలని వైసీపీ శ్రేణులకు సవాల్ విసిరారు. కాగా తెలుగుజాతి భవిష్యత్తు తరాల కోసం, ప్రపంచంలోనే అద్భుత రాజధానుల్లో ఒకటిగా నిలపాలనే సంకల్పంతో అమరావతి నిర్మాణం చేపట్టామని ఆయన చెప్పారు. రైతుల ముందుకొచ్చి తమ భూముల్ని ఇచ్చారు. కానీ నేడు తెలుగుజాతి కలల రాజధాని అమరావతిని చంపేశారని వాపోయారు. అభివృద్ధి కాస్త తిరోగమనంలో ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో 600మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని అన్నారు. తాము ఎన్నికల వరకే పార్టీలని భావించి మిగతా సమయం ప్రజాసంక్షేమం కోసమే పనిచేశామని, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడమే ధ్యేయంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజావేదిక కూలదోయడంతో మొదలైన జగన్ ప్రజా వ్యతిరేక చర్యలు ప్రభుత్వ పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం వరకూ కొనసాగుతున్నాయన్నారు. లక్ష రూపాయల ఫర్నిచర్ కోసం పేదల డాక్టర్ కోడెలను వేధించి, చివరకు ఆయన మరణానికి కారణమయ్యాడని, ధ్వజమెత్తారు. అవినీతిని తవ్వితీసిన అధికారులకు పురస్కారాలు ఇస్తానని ప్రకటించారని వ్యంగ్యంగా అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారికి పోలీసులు రక్షణ కల్పించడం, బాధితులపై కేసులు నమోదు చేయడం మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. కొంతమంది పోలీసులు వలన అందరికీ చెడ్డపేరు వస్తోందని, ఖాకీ బట్టలు వేసుకొని తప్పుడు కేసులు బనాయిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, పవిత్రమైన పోలీస్ ఉద్యోగాన్ని శాంతి భద్రత పరిరక్షణకు మాత్రమే ఉపయోగించాలని, ఈ విషయంలో పోలీస్ అధికారుల సంఘం కూడా అటువంటి చర్యలను సమర్థించకూడదని ఆయన హితవు పలికారు. పోలీసులు చివరకు తమ విధులు మానేసి ఆటోలకు స్టిక్కర్లు అంటించుకుంటూ స్టిక్కర్ పోలీసులుగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన జైలు సహచరులందరికీ ఒక్కొక్కరిగా జగన్మోహన్‌రెడ్డి పదవులు ఇచ్చుకుంటూ వెళుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారిని పిఎంఓకు తీసుకెళ్లడం వెనుక ఉద్దేశ్యమేమని ఆయన ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపిన వారినే ఇంతవరకూ పట్టుకోలేకపోయారని, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.

*చిత్రం...నెల్లూరులో సోమవారం జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు