ఆంధ్రప్రదేశ్‌

15వేల పాఠశాలల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇంజనీర్లదే కీలక బాధ్యత అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో మనబడి నాడు-నేడుపై సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.
వౌలిక వసతుల కల్పనలో గతంలో జరిగిన తప్పిదాల నుండి అధికారులు పాఠాలు నేర్చుకుని అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి, పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. రాష్టబ్రడ్జెట్‌లో విద్యారంగానికి అత్యధిక నిధులను కేటాయించారన్నారు. నవంబర్ 14 నుండి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తొలిదశలో 15 వేల పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. అవినీతికి తావులేకుండా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో నిర్మించిన అదనపు తరగతి గదులు ఎలా ఉన్నాయో తెలిసిందన్నారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని, పాఠశాలలను అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టంచేశారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పాఠశాలల ఫొటోలను తెప్పించామని, మార్పు చేసిన తర్వాత ఎలా ఉన్నాయో తప్పనిసరిగా ఫొటోలతో ప్రజల ముందు ఉంచుతామన్నారు. పాఠశాలల అభివృద్ధిలో పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేస్తామని తెలిపారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్