ఆంధ్రప్రదేశ్‌

‘పశ్చిమ’లో బలవర్ధీకరించిన బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా బలవర్ధీకరించిన బియ్యం (్ఫర్టిఫైడ్ రైస్) పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు బలవర్థీకరించిన బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015-16 సంవత్సరంలో నిర్వహించిన జాతీయ హెల్త్ సర్వే ప్రకారం దేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 38 శాతం మంది సరైన ఎదుగదల లేని వారు కాగా, 36 శాతం మంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువుతో ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేశారు. బలవర్థీకరణలో భాగంగా ఐరన్, విటమిన్ బి 12, బి 6 తదితర విటమిన్లు, ఖనిజాలను ప్రత్యేక పద్ధతిలో బియ్యానికి జోడిస్తారు. ఇందుకు కిలోకి 60 పైసలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. అయితే దీనిపై 18 శాతం మేర కేంద్రం జీఎస్టీ విధిస్తోంది. దీంతో బలవర్థీకరణ ఖర్చు కిలోకి 71 పైసలకు చేరుతోంది. దీనికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నా, దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాగా రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో బలవర్థీకరించిన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలను ఈ ఏడాది జూలైలో ఆహ్వానించింది. 25 కిలోల బ్యాగ్‌లను నెలకు 483 టన్నుల మేరకు ఆరు నెలల పాటు సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌లకు సరఫరా చేసేందుకు ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ నుంచి అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.