ఆంధ్రప్రదేశ్‌

దళితులపై దాడులను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: రాష్ట్రంలో దళితులపై రకరకాల పేర్లతో దాడులు, అత్యాచారాలు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉండగా, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా పీసీ పల్లిలో గ్రానైట్ యాజమాన్యం ఒక కార్మికుడిని హతమార్చితే స్థానిక పోలీసులు ప్రమాదం అని, కేసు రాజీ చేసుకోండంటూ బాధితులను బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రకాశం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌ను కలిసినప్పటికీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. అలాగే నెల్లూరు జిల్లా దగదర్తి పోలీసుస్టేషన్ పరిధిలో ఆరి ప్రమీల ఆశావర్కర్‌గా దశాబ్దకాలం నుండి పనిచేస్తున్నా ఆమెపై ఎటువంటి రిమార్కులు లేవన్నారు. కొందరు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని, స్థానిక పోలీసులు చికిత్స పొందుతున్న ఆమె వద్దకు వెళ్లి ప్రాథమిక వివరాలు సేకరించి నెలరోజులు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదని, పోలీసులను అడుగుతుంటే రాజీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారని డీజీపీ దృష్టికి తెచ్చారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం పోలీసుస్టేషన్‌లో నందనకుమార్, బీసీ యువతి చందన ప్రేమించి వివాహం చేసుకున్నారని, అయితే ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను కొట్టి చంపి ఆనవాళ్లు లేకుండా కాల్చి బూడిద చేయగా పోలీసులు బూడిద సంచులను స్వాధీనం చేసుకున్నారన్నారు. బాలిక తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామ దళితులకు రక్షణ కల్పించాలని, అలాగే శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అవలంగికి చెందిన జక్కయ్యను హత్యచేసిన నిందితులను నేటికీ అరెస్ట్ చేయకపోగా, పోలీసులే వారిని రక్షిస్తున్నారని మాల్యాద్రి లేఖలో ఆరోపించారు. ఈ సమస్యలపై వెంటనే తమరు జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు.