ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు రూ. 6వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: ఇంధనశాఖకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు రూ. 6వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలను సత్వరమే చెల్లించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ విషయమై మంగళవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు.
వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఇంధనశాఖకు సుమారు రూ. 6వేల కోట్ల వరకు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని, అందుబాటులో ఉన్న వనరులు సమకూర్చుకుని సకాలంలో వాటిని వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా జలవనరులశాఖ ద్వారా రూ. 2వేల కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 500 కోట్ల మేర చెల్లించాల్సి ఉందన్నారు. పురపాలక, వైద్య, ఆరోగ్యశాఖలు ద్వారా మరి కొంత బకాయిలు వసూలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్న సాధారణ నిధుల నుండి విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీని ఆదేశించారు. జలవనరుల శాఖకు సంబంధించిన విద్యుత్ బకాయిలను వాటర్ గ్రిడ్ పథకంలో పొందుపరచాలని సూచించారు. వెంటనే కొంత మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించేలా చూడాలని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ను ఆదేశించారు. విద్యుత్ బకాయిలకు సంబంధించి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు త్వరగా ఆమోదించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌కు సూచించారు. మంచినీటి వృథాను నియంత్రించేందుకు ప్రతి రిజర్వాయర్ పరిధిలో, గ్రామ స్థాయిలో వాటర్ పంపింగ్ స్టేషన్ పరిధిలో బల్క్ ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాటర్ ఆడిట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని ప్రతి నీటి బొట్టు సద్వినియోగం అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో పురపాలకశాఖ కార్యదర్శి జే శ్యామలరావు, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధరబాబు, ఇంధనశాఖ అధికారులు పాల్గొన్నారు.