ఆంధ్రప్రదేశ్‌

ఉచిత ఇసుకతో.. మాఫియాకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 25: ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని పట్ట్భాముల్లో ఇసుకను ఉచితంగా తవ్వుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయటంతో జిల్లావ్యాప్తంగా ఇసుకమాఫియాకు అడ్డుకట్ట పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఐదు ఇసుక రీచ్‌ల ద్వారానే ఇసుకను ఉచితంగా తరలిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా పట్ట్భాముల్లో ఇసుకను తవ్వుకునేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా పట్ట్భామి కలిగిన భూ యజమాని ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించే లక్ష్యంతో తహశీల్దార్‌కు అర్జీపెట్టాల్సిఉంది. అనంతరం ఆ అర్జీప్రకారం ఆ భూమిలో ఎన్నిక్యూబిక్‌మీటర్ల ఇసుక లభ్యవౌతుందో భూగర్భగనుల శాఖాధికారులు నిర్ణయించి అనుమతులకోసం జిల్లాకలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ప్రకారం జిల్లాకలెక్టర్ అనుమతులను మంజూరు చేస్తారు.
కాగా జిల్లాలోని చీరాల, చినగంజాం, వేటపాలెం, కొత్తపట్నం, ఈతముక్కలతోపాటు, సముద్రతీర్రప్రాంత మండలాల్లోను, పశ్చిమప్రాంతంలోని పలుప్రాంతాల్లో ఇసుకమేటలు వేసిన పట్ట్భాముల్లో ఉచితంగా ఇసుకను తవ్వుకునేందుకు వీలు ఉంటుంది. ఇసుకను తవ్వుకునేందుకు కేవలం నామమాత్రంగానే ధరను యజమాని వసూలు చేయాల్సి ఉంటుంది. ఆవిధంగాకాకుండా ఎక్కువమొత్తంలో నగదు వసూలుచేస్తే మైన్స్ అధికారులు లీజు రద్దుచేయనున్నారు. ముఖ్యంగా కోస్తాతీరప్రాంతంలోని వందలాది ఎకరాల్లో ఇసుకమేటలు వేసి ఉన్నాయి. నాలుగువందల సంవత్సరాల క్రితం సముద్రం పొంగి ప్రవహించటంతో కోస్తాతీరప్రాంతంలో ఇసుక మేట వేసినట్లు సమాచారం. ఆ తరువాత సముద్రం పొంగి వెనక్కివెళ్ళిన తరువాత ఇసుకమేటలు ఉప్పునీటిగా ఉండేవని అధికారవర్గాల ద్వారా సమాచారం. అప్పటినుండి భారీ వర్షాలు కురవటంతో ఇసుకలో ఉన్న ఉప్పునీటి శాతం పోయి మంచినీటి ఇసుకకగా రూపాంతం చెందిందని అధికారులు చెబుతున్నారు. కాగా పట్ట్భాముల్లోనే కాకుండా ప్రభుత్వభూముల్లోను ఇసుక మేటవేసి ఉంది. కొంతమంది ఇసుక మాఫియా దారులు ఈపాటికే ప్రభుత్వభూముల్లోని ఇసుకను తవ్వుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నప్పటికి అధికారులు మాత్రం నిమ్మకునిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇసుక ఇబ్బడిముబ్బడిగా అతితక్కువ ఖర్చుతో లభ్యమయ్యే అవకాశాలున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా భవననిర్మాణాలు వేగంగా జరగనున్నాయి. గతంలో ట్రాక్టర్ ఇసుక ఒంగోలుకు చేరిస్తే నాలుగువేలరూపాయలనుండి నాలుగువేల ఐదువందల రూపాయల వరకు పలికింది. ఇసుక ప్రభావం ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకంపై కూడా పడింది. ఇసుక లభించక ప్రజలు నానా అవస్థలు పడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని భవనాల నిర్మాణాలు శరవేగంగా జరిగే అవకాశాలున్నాయి.
కాగా మరో రెండు ఇసుక రీచ్‌ల్లో ఉచితంగా ఇసుకను తవ్వుకునేందుకు కలెక్టర్ అనుమతులు మంజూరుచేసినట్లు భూగర్భగనుల శాఖ అసిస్టెంట్ డైరక్టర్ బొడ్డు రామచంద్రరావు ఆంధ్రభూమిప్రతినిధికి తెలిపారు. జిల్లాలోని ఉలవపాడు మండలంలోని రాజుపాలెం,కొల్లూరుపాడు రీచ్‌లో 42500క్యూబిక్‌మీటర్లు, కె బిట్రగుంట రీచ్‌లో 45,475క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ రెండురీచ్‌లనుండి ఇసుకను ఉచితంగాప్రజలు తీసుకువెళ్ళవచ్చునని ఆయన పేర్కొన్నారు.