ఆంధ్రప్రదేశ్‌

ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు ఉండవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : నిరుద్యోగులకు ఊరట ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి ఏపీపీఎస్సీ ద్వారా నియమించే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఏపీపీఎస్సీపై గురువారం ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని, కేవలం రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐఎం, ఐఐటి వంటి సంస్థలు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. అత్యవసర సర్వీసుల విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారితీస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఇకపై తప్పులు జరుగకుండా, ఉద్యోగ నియామకాల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని అధికారులను కోరారు. జనవరిలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు.