ఆంధ్రప్రదేశ్‌

కౌమారదశకు ‘కిశోరి వికాసం’తో భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 17: కౌమారదశలో ఉన్న పిల్లలు సాధికారత సాధించే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ కిశోరి వికాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం వైఎస్‌ఆర్ కిశోరి వికాసం పథకాన్ని మంత్రులు తానేటి వనిత, మేకతోటి సుచరిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ గతంలో ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో కౌమారదశలో ఉన్న పిల్లల ఆలోచనలు, సమస్యలను వారి తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలతో పంచుకునే వారన్నారు. కానీ నేటి ఆధునిక పోకడల కారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడంతో పాటు, పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ధనార్జన, ఇతర వ్యాపకాల కారణంగా దూరం కావడంతో వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే వారు స్మార్ట్ఫోన్లకు అలవాటుపడి ఉజ్వలంగా ప్రకాశించాల్సిన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారన్నారు. అంతేకాకుండా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై అమ్మ ఒడి, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ కౌమారదశలో ఉన్న పిల్లలపై జరిగే వివిధ రకాలైన వేధింపులు, నిర్లక్ష్యం, దోపిడి, హింసను గుర్తించి, వాటిని ఎదుర్కొనే నైపుణ్యాలను పెంచడమే కిశోరి వికాసం ముఖ్య ఉద్దేశమన్నారు. అర్ధరాత్రి వేళ మహిళ స్వేచ్ఛగా వెళ్లినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పిన విధంగా, మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు క్రితికాశుక్లా, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
*చిత్రం...కిశోరి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు తానేటి వనిత, మేకతోటి సుచరిత