ఆంధ్రప్రదేశ్‌

పార్టీ కమిటీల్లో యువతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 17: భవిష్యత్తులో పార్టీకి సంబంధించి ఏర్పాటయ్యే ప్రతి కమిటీలోనూ యువతకు పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థికలోటుపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని, అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, తాజాగా ప్రభుత్వ పాలనలోని అస్తవ్యస్థ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మీడియాపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని తీర్మానించింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులకు సంబంధించి 13 అంశాలపై పొలిట్‌బ్యూరో చర్చించింది. దాదాపు 13 అంశాలపై గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించారు. పొలిట్‌బ్యూరో నుంచి పలువురు నేతలు బయటకు వెళ్లిపోయిన నేపథ్యంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొత్తగా చేరారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల వైసీపీ నేతల దాడిలో మృతిచెందిన కార్యకర్తలు, నేతలు, అదే విధంగా ఇటీవల మృతిచెందిన పార్టీనేతలు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, ఇటీవల గోదావరి పడవ ప్రమాద మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. చంద్రబాబు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ పటిష్టత కోసం ఏర్పాటయ్యే కమిటీలలో ఇకపై యువత, మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చేలా చూడాలని కోరారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామస్థాయిలో రోడ్లు, మరుగుదొడ్ల నుండి పోలవరం వరకు అన్ని పనులు పూర్తిగా నిలిచిపోయి, పాలన స్తంభించిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే వ్యవస్థ మొత్తం స్తంభించిపోయి ఆర్థిక పరిస్థితి నీరుగారిపోయిందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకుల నిర్ణయాలను గౌరవించిన సంస్కృతి తెలుగుదేశం పార్టీదని పేర్కొన్నారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పథకాలు, విధానాలను, ప్రాజెక్టులను, ఇతర నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తుచేశారు. చరిత్రలో ఎవరూ కూడా జగన్‌లా ప్రవర్తించలేదని తప్పుబట్టారు. మద్యపాన నిషేధమంటూ సొంత ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. మీడియా మెడలు వంచాలనే దుర్మార్గపు ఆలోచనతో గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన జీవోకి కొనసాగింపుగా ఆయన కుమారుడు జగన్ తీసుకువచ్చిన జీవోలో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాను కూడా భాగం చేశారని, ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే వారిని జైలుకు పంపాలనుకోవడం నియంతృత్వం కాక మరేమిటని ప్రశ్నించారు. వివేకా హత్య గురించి ప్రశ్నించారని వర్ల రామయ్య, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతుందన్న అక్కసుతో భూమా అఖిలప్రియ భర్తపై అక్రమ కేసులు నమోదు చేయించడం ఇందుకు నిదర్శనం కాదా అంటూ నిలదీశారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలు, కార్మికుల ఆత్మహత్యలపై పొలిట్‌బ్యూరో సమావేశం తీవ్ర విచారం వ్యక్తంచేసింది.
*చిత్రం...టీడీపీ కార్యకర్తల ఆత్మశాంతి కోరుతూ వౌనం పాటిస్తున్న పొలిట్‌బ్యూరో