ఆంధ్రప్రదేశ్‌

పల్నాడు వైసీపీ బాధితులకు టీడీపీ సాయం అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 19: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయని, వీరి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పల్నాడు పరిధిలోని ఆత్మకూరు, పినె్నల్లి, జంగమేశ్వరపాడు తదితర గ్రామాలకు చెందిన వైసీపీ బాధితులకు శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులకు భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ ప్రభుత్వం ఆరిపోయే దీపం వంటిదన్నారు. టీడీపీ హయాంలో తమ అధినేత చంద్రబాబు కేవలం అభివృద్ధి గురించే ఆలోచించారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో తాము కూడా ఇలాగే చేసి ఉంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉండేవి కావన్నారు. తాము ప్రజాస్వామ్యయుతంగా పనిచేశామని, వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు.
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, పాత్రికేయుల గొంతు నొక్కేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే మీడియా రంగాన్ని అణగదొక్కాలని, తమకు అనుకూలమైన వార్తలను మాత్రమే రాసేటట్లుగా ఒక బలవంతపు నిర్బంధానికి ప్రయత్నిస్తున్నదని కేశినేని భవన్‌లో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆనాడు దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 938 జీవోని అమల్లోకి తీసుకొచ్చారని, అప్పట్లో పత్రికా లోకం ప్రజాస్వామ్యవాదులంతా ప్రత్యక్ష ఆందోళనకు దిగితే ప్రభుత్వం ఆ జీవోను వెనక్కి తీసుకుందని వర్ల తెలిపారు. ఈ రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పత్రికల నోరునొక్కడం కోసం మళ్లీ అదే 938 జీవోను మరింతగా మెరుగులుదిద్ది, సోషల్ మీడియాను కూడా అందులో కలుపుతున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నారు. టీడీపీ హయాంలోనే ఈ జీఓ ఉందని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.