ఆంధ్రప్రదేశ్‌

మహిళా వలంటీర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, అక్టోబర్ 19: తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వేధింపులు భరించలేక ఇటీవల కొత్తగా నియమితులైన ఓ మహిళా వలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. మగ దిక్కులేని తమ కుటుంబానికి ప్రభుత్వం వలంటర్ ఉద్యోగం ఇచ్చిందని, నాన్న లేని కుటుంబాన్ని ఆదుకునే ధైర్యం ఉందమ్మా అంటూ మొదటి నెల జీతం తీసుకున్న తన కూతురు ఉరి వేసుకుని తనువు చాలించిందంటూ మృతురాలి తల్లి తల్లడిల్లిపోవడం పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆఫీస్‌నగర్‌లో నివాసం ఉంటున్న షేక్ జూవేద అదే ప్రాంత వలంటీర్‌గా పని చేసేందుకు ప్రభుత్వం నియమించింది. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో గుంటూరు శివప్రసాచాచారి అనే కంప్యూటర్ ఆపరేటర్ తన స్నేహితులతో కలిసి వచ్చి నీకు ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయలేదని, సమావేశాలకు సరిగా రావటం లేదని, తాను చెప్పిన విధంగా జాబితా తయారుచేసి అందించకపోతే నీ పోస్టుకు గండం అంటూ గట్టిగా బెదిరించి వెళ్లాడని మృతురాలి తల్లి వాపోయింది. దీంతో మనస్థాపం చెందిన తన కూతురు ఇంట్లోని బాత్‌రూంలో ఉరి వేసుకుని మరణించిందని పోలీసుల ఎదుట వాపోయింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. జూవేద మరణవార్త తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా మార్చురీలో ఉన్న జూవేద మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సీఐ మారుతీకృష్ణ, ఎస్సై ముక్కంటి ఆందోళనకారులకు సర్దిచెప్పనా వారు ఆందోళన కొనసాగించారు. జూవేద మృతికి కారణమైన కంప్యూటర్ ఆపరేటర్‌ను శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు, పోలీసులు లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే విరమిస్తామని వారు భీష్మించడంతో గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చివరకు వైసీపీ నేత ఒంగోలు మూర్తిరెడ్డి మంత్రితో మాట్లాడి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం ఐదు గంటలకు పోస్టుపోర్టం నిర్వహించారు. తహశీల్దార్ కె వేణుబాబు తదితరులు ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. వేధింపులకు కారణమైన కంప్యూటర్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.