ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ, వైసీపీ దొందూ దొందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, అక్టోబర్ 19: గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలకు ప్రభుత్వ నిధులు పంచిపెట్టినట్టే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. టీడీపీ బాటలోనే వైసీపీ కూడా నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శనివారం గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి వచ్చిన కన్నా విలేఖరులతో మాట్లాడారు. ఈసందర్భంగా కన్నా మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందే రైతులకు పంట పెట్టుబడికై 6వేల రూపాయలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, దానిలో భాగంగానే నేడు బీజేపీ రైతులకు పంట పెట్టుబడి కింద వారి ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. కాని వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా రైతుకు పంట పెట్టుబడి కింద రూ.12,500 ఇస్తామని చెప్పిందని, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న డబ్బుతో కలిపి 13,500 ఇస్తామంటున్నారని తెలిపారు. కేంద్రం రైతులకు ఇచ్చే డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోందని ఆయన విమర్శించారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులకై కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని అన్నారు. కేంద్రం దేనికోసమైతే నిధులు విడుదల చేసిందో దానికే ఖర్చు చేయాలన్నారు. నిధులు దుర్వినియోగం చేయడం, దారిమళ్లించడం జరిగితే కేంద్రం విచారణ చేపడుతుందని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలతో ఎప్పుడూ ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. ప్రజలంతా ఆర్ధికాభివృద్ధి సాధించి సంతోషంగా ఉండాలంటే కేంద్రం, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే మార్గమన్నారు. ప్రజలంతా త్వరలో దీనిని గ్రహిస్తారని ఆయన తెలిపారు.