ఆంధ్రప్రదేశ్‌

భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉంటూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు.
మన రాజ్యాంగం చాలా పవిత్రమైనదని, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వాద దేశమని ఎన్నో మతాల వారు కలసి మెలసి ఐకమత్యంగా నివసిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నారన్నారు. ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ 20వ జాతీయ స్థాయి సమావేశం శనివారం విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్య్రం తేవడంలో ముస్లింలు కీలకపాత్ర పోషించారన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జన కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులతో సమానంగా ముస్లిం మేధావులు, మత పెద్దలు, సామాన్య ప్రజలు సైతం ఆడ, మగ తేడా లేకుండా ప్రాణాలర్పించారన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమ మతాచారాలు, సాంప్రదాయాలను స్వేచ్ఛగా ఆచరించుకునే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు రావడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ముస్లింలు ఎన్నో త్యాగాలు చేశారని వారిని స్మరించుకోవాలని అన్నారు. భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్యపరమైన సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ పని చేయడం ఈ లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి ముస్లిం మేధావులతో పాటు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మత పెద్దలు పాల్గొన్నారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా