ఆంధ్రప్రదేశ్‌

మాతా, శిశు మరణాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: మాతా,శిశు మరణాల నివారణకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ ఎం) బృందం సూచించింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో సీఆర్‌ఎం బృందం శనివారం విస్తృతంగా పర్యటించింది. దీనిలో భాగంగా అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బొర్రా సబ్ సెంటర్, అరకు ఏరియా ఆసుపత్రుల్లో రికార్డులు, నిధుల జమ, ఖర్చులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనూరాధ, డాక్టర్ శ్రీనివాస్ బృందం ఆసుపత్రిల్లో రోగుల వివరాలతో పాటు, ఓపీ, ఐపీ, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గిరిజనులు, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ముచ్చటించారు. రాష్ట్రంలోనే హైరిస్క్ జిల్లాగా పేరొందిన విశాఖ జిల్లాలో గిరిజనులకు అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా వైద్యసేవలు మెరుగు పర్చాలని వైద్యులను ఆదేశించారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులు, జమ, ఖర్చుల వివరాల్లో చిన్నపాటి తేడాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అరకు ఏరియా ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టి, రోగులకు అందుతున్న వైద్యసేవలపై వాస్తవ పరిస్థితులు, రికార్డుల నిర్వహణ, వైద్య పరికరాలు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ తదితర వాటిని బృందం నిశితంగా పరిశీలించింది. ముఖ్యంగా విశాఖ మన్యంలోని దీర్ఘకాలిక, అంటువ్యాధుల నివారణకు తీసుకుంటున్న నివారణ చర్యలపై స్థానిక వైద్యులు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాతా,శిశు మరణాల నివారణకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటాన్నారో తెలుసుకొని, ఆధునాతన పద్ధతులు అవలంభించాలని వైద్యులకు సూచించారు. నాలుగేళ్లకోసారి తనిఖీ చేసే ఈ బృందం విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తనిఖీల్లో ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వాణీశ్రీ, డీఎంహెచ్‌వో డాక్టర్ తిరుపతిరావు, మలేరియా అధికారి డాక్టర్ మణి, అనంతగిరి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ అనుషరావు, డాక్టర్ సంధ్య పాల్గొన్నారు.