ఆంధ్రప్రదేశ్‌

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మైనింగ్‌కు అనుమతులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: ప్రజాభిప్రాయసేకరణ లేకుండా, నిపుణుల అభిప్రాయాలు సేకరించకుండా మైనింగ్‌కు ఏ విధంగా అనుమతులు ఇస్తారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో జిల్లా పౌర గ్రంథాలయంలో శనివారం ‘రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతాల్లో మైనింగ్- కళ్యాణలోవ’ అనే అంశంపై నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు జవాబుదారీగా ఉండాలన్నారు. మైనింగ్‌కు అనుమతులు, లీజులకు ఇవ్వడం వలన దీని ప్రభావం జలాశాలయాలపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నిర్మించారని, దీని పరీవాహక ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారని, కానీ, ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని లేదంటే దీనికి భవిష్యత్ లేదని హెచ్చరించారు. సమాచారహక్కు చట్టం మాజీ కమీషనర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ మైనింగ్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ ప్రదేశాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలన్నారు. చట్టాల ఉల్లంఘనపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మైనింగ్ వలన రిజర్వాయర్లు దెబ్బతింటున్నాయని, రైతులు, అన్ని వర్గాల ప్రాథమిక హక్కుకు భంగం కలుగుతుందన్నారు. రిజర్వాయర్ల పరీవాహక ప్రదేశాల్లో నిర్మాణాలు చేయరాదంటూ కోర్టులు తీర్పునిచ్చినా అనేక పరిణామాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక కార్యకర్త కె సజయ మాట్లాడుతూ నాగార్జునసాగర్ మీద భారీ వాహనాలకు అనుమతి లేదని, బ్రిడ్జి పగుళ్ళు వస్తే ఎదురయ్యే ప్రమాదాలపై ముందుగానే గుర్తించారన్నారు. సహజసిద్ధమైన కళ్యాణలోవ రిజర్వాయర్‌కు అతి సమీపంలోనే క్వారీలు, మైనింగ్ నిర్వహణ జరుగుతోందని, దీని వలన అనేక రకాలైన నష్టాలను ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రానైట్ బరువుతో వెళ్ళే వాహనాల వలన నీటి మార్గాలు మూడపడతాయన్నారు. ఖనిజ సంపద కొల్లగొడితే ప్రకృతి కోపంగా మానవాళికి సమాధానం చెబుతుందన్నారు.

*చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ