ఆంధ్రప్రదేశ్‌

‘వాహన మిత్ర’ మార్గదర్శకాల సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వైఎస్సార్ వాహనమిత్ర మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దరఖాస్తుల గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వచ్చేనెల 15వ తేదీ కల్లా అర్హులైన లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ చేయటంతో పాటు 20 లోగా వారికి సమాచారం అందించాలని ఆదేశించింది. దరఖాస్తు నిబంధనలపై ఒకింత గందర గోళం నెలకొన్న నేపథ్యంలో కొన్ని అంశాలను సడలించింది. తాజా సవరణల ప్రకారం ఆటోలు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నా డ్రైవర్లందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. లబ్ధిదారుని తండ్రి లేదా తల్లి, సోదరుడు, సోదరి పేరిట ఉన్నప్పటికీ అర్హునిగా ప్రకటిస్తారు. ఇరువురి పేర్లు వేర్వేరు రేషన్ కార్డులలో ఉన్నా అనుమతిస్తారు. అయితే బ్యాంక్ ఖాతా మాత్రం వాహన యజమాని పేరుతోనే ఉండాలని నిబంధన విధించారు. లబ్ధి దారునికి కుటుంబ సభ్యులతో సంబంధాన్ని నిర్ధారించుకున్న అనంతరం సంబంధిత పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, గ్రామ, వార్డు వలంటీర్లు పరిశీలన జరుపుతారు. ఆపై ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తెలుపురంగు రేషన్ కార్డులో పేరు లేదనే కారణంగా తిరస్కరించిన వారు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఈనెల 31 వరకు గడువు పొడిగించింది. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, వార్డు, గ్రామ వలంటీర్లకు నేరుగా దరఖాస్తులు అందించవచ్చని మార్గదర్శకాల్లో సూచించింది. నవంబర్ 8 కల్లా దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుంది. 10న అర్హులను గుర్తిస్తారు. 15వ తేదీలోగా ఆటో డ్రైవర్ల ఖాతాలో నగదు జమ చేస్తారు. 20వ తేదీ నాటికి ముఖ్యమంత్రికి పూర్తి స్థాయి నివేదిక అందించాల్సి ఉంటుంది.