రాష్ట్రీయం

అలల ధాటికి కదులుతున్న బోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 19: అఖండ గోదావరి నది ఎడమ గట్టు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత నెల 15వ తేదీన గోదావరి నదిలో 77 మందితో ప్రయాణిస్తూ సుడిగుండంలో బోల్తా పడిన రాయల్ వశిష్ఠా పున్నమి ప్రైవేటు బోటును వెలికి తీసేందుకు ప్రమాద ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా మారాయి. బోటును వెలికితీసేందుకు ద్వితీయ ప్రయత్నంలో భాగంగా బోటు వెలికితీత పనులను బాలాజీ మెరైన్స్ సంస్థ ధర్మాడ సత్యం బృందం గత నాలుగు రోజులుగా సాగిస్తోంది.
ప్రస్తుతం బోటు మునిగిపోయిన ప్రదేశమైన కచ్చులూరు వద్ద నీటి మట్టం రోజు రోజుకూ తగ్గుముఖం పట్టింది. దీంతో బోటు వెలికి తీసేందుకు భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా మారాయని అంటున్నారు. బోటు నదిలో సుమారు 50 అడుగుల లోతులోనే ఉండటం వల్ల డైవర్స్ లోనికి వెళ్లి బోటుకు ముందూ వెనుక లంగర్లు వేసి రాగలిగితే బయటకు తీసేందుకు సులువైన విధంగా లాగేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం ఒక లంగరు వేసి లాంగేందుకు ప్రయత్నించగా అది తగల్లేదు. కొక్కెం తలగకుండా ఊడిపోయి బయటకు వచ్చేసింది. అయితే గత నాలుగు రోజులుగా లంగర్లు తగిలించి ప్రయత్నిస్తుండటంతో బోటు కాస్తంత కదిలింది. బురదలో కూరుకున్న బోటులో నీటి అలలతో కదలిక వచ్చినట్టు గుర్తించారు. మట్టిలో కూరుకుపోయిన బోటు సుమారు 40 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేశారు. ఇంత బరువును నీటిలోంచి లాగాలంటే లంగర్లను సరిగ్గా బోటుకు రెండు వైపులా వేసి బలమైన ఇనుప తాళ్లను ప్రొక్లైన్లకు కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు రోజులుగా వలయాకారంలో లంగరు వేసి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా లాగేటప్పుడు లంగరు తాళ్లు బోటు అడుగు నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తెలిసింది. ధర్మాడ సత్యం బృందం చేపట్టిన ప్రక్రియ సవ్యమైన విధానంలోనే జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద బోటు తెలికి తీత పనులు ధర్మాడ సత్యం బృందం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వలయాకారంలో వేసిన తాళ్లు శనివారం బయటకు వచ్చేయగా, మళ్లీ వేసిన లంగరు తగులుకుంది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో బోటు బయటకు వచ్చేందుకు సానుకూల పరిస్థితుల కనిపిస్తున్నాయి.
*చిత్రం...గోదావరిలో బోటు వెలికితీసేందుకు ప్రయత్నాలు