ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చింది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), అక్టోబర్ 19: అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎంతో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు బాబుకు లేదని శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై విరక్తి చెందిన ప్రజలు జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యధిక మెజార్టీతో పట్టం కట్టిన విషయాన్ని బాబు గ్రహించాలన్నారు. తనకు అనుకూలమైన పత్రికలను, మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని అనేక మంది జీవితాలతో చంద్రబాబు ఆటలాడుకున్నారని ఆరోపించారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో ప్రజలే బలమైన వారు కావడంతో బాబు మోసాలను పసిగట్టిన వారు వైసీపీకి పెద్ద పీట వేశారన్నారు. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగునెలలు కావస్తోందని, అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, గూండాయిజం పెరిగిపోతుందని, రాష్ట్రం బిహార్‌లా మారిందని చంద్రబాబు విమర్శించడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అపఖ్యాతిని కూడగట్టుకుందనే విషయాన్ని జపాన్ ప్రతినిధి ఒకరు ఏపీలోనే దోపిడీ ఎక్కువగా సాగుతోందని, ఇది బిహార్ కన్నా అధ్వాన్నంగా మారిందని పేర్కొనడం గమనించాలన్నారు. కాంట్రాక్ట్ విషయాల్లో తనవారికి అధిక మొత్తానికి కట్టబెట్టిన చంద్రబాబునాయుడు నేడు జగన్మోహనరెడ్డి పారదర్శకంగా టెండర్లను ఖరారు చేయడంతోపాటు వందకోట్లు దాటిన టెండర్లను జ్యుడిషియల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. పత్రికలపై గడిచిన నాలుగు నెలల కాలంలో వైసీపీ ఏమైనా కొత్త చట్టాలను తీసుకొచ్చిందా? యాజమాన్యాలు, విలేఖరులపైన అక్రమ కేసులు ఏమైనా నమోదు చేసిందా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశమే ఉండేది కాదని, ఒక ఎమ్మెల్యే ఎమ్మార్వోపై దాడి చేస్తే ఆయన ఎందుకు స్పందించలేదని ధర్మాన ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్నారని, అందులో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను రద్దుచేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రూ.265కోట్లు విడుదల చేయడం ఎంతైనా హర్షదాయకమన్నారు.