ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: రాష్ట్ర అవతరణ దినాన్ని పండుగలాగా నిర్వహించాలని, ఆ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి అర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమేకానీ, అది నవంబర్ 1న కాకుండా అక్టోబర్ 1న జరపాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న కాకుండా అక్టోబర్ 1న నిర్వహించడం సమంజసమన్నారు. 1956, నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటైందన్నారు. 2014, జూన్ 2న మన అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా విడిపోయి నవ్యాంధ్ర ఏర్పాటైందని తులసీరెడ్డి అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి అక్టోబర్ 1వ తేదీ పుట్టినరోజైతే, నవంబర్ 1వ తేదీ పెళ్లిరోజు, జూన్ 2వ తేదీ విడాకులు పొందినరోజు అన్నారు. కాబట్టి పుట్టిన రోజు పండుగను అక్టోబర్ 1న జరుపుకోవాలన్నారు. విడాకులు అయిన తర్వాత మునపటి పెళ్లిరోజును పుట్టిన రోజుగా జరుపుకోవడమేమిటని ప్రశ్నించారు.