ఆంధ్రప్రదేశ్‌

విద్య వ్యాపారీకరణకు అడ్డుకట్ట వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 20: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించి, విద్య వ్యాపారీకరణకు అడ్డుకట్ట వేస్తామని, ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు, 19వ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. మూడురోజులు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీటీఎఫ్ అధ్యక్షుడు కే వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా విద్యా శాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ విద్యా శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 23వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలు అనే తేడాలేకుండా ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇందులో భాగంగా మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీపీఎస్ రద్దుకు కట్టుబడి ఉన్నామని సురేష్ స్పష్టం చేశారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 75సంవత్సరాల ఉపాధ్యాయ ఉద్యమంలో మార్పు బాలకృష్ణమ్మ కృషి ఎనలేనిదని గుర్తుచేశారు. నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపిన ఘనత ఏపీటీఎఫ్‌దేనని శ్లాఘించారు. వీలైనంత వరకు వివిధ విభాగాల నుంచి విద్యను ఒకే గొడుగు కిందికి తేవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యంపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏఎస్ రామకృష్ణ, కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్త్ఫా, మేరుగ నాగార్జున, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏ సదాశివరావు, కార్యదర్శి జీ హృదయరాజు, తదితరులు పాల్గొన్నారు. కాగా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ మేనల్లుడు జగ్మోహన్‌సింగ్ కార్యక్రమానికి హాజరై మాతృభాష మాద్యమాన్ని అమలు చేసి నాణ్యమైన విద్య విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*చిత్రం... సభలో మాట్లాడుతున్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్