ఆంధ్రప్రదేశ్‌

పల్స్ సర్వే వల్లే మంజునాథ కమిషన్ పర్యటనలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సాధికారిక సర్వే కారణంగానే కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ జిల్లాల పర్యటన ఆలస్యం అవుతోందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే పూర్తయిన అనంతరం మంజునాథ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించి, కాపుల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితి గతులపై అధ్యయనం చేస్తుందన్నారు. పాదయాత్ర సందర్భంగా కాపులు తమను బిసిలో చేర్చాలని మాత్రమే కోరారని, అయితే కాపు సామాజిక వర్గం పరిస్థితులను స్వయంగా చూసిన చంద్రబాబు వారికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతనిచ్చారన్నారు. వారి అభ్యున్నతి కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా సహకారం అందిస్తున్నారని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు రుణాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉన్నత చదువులకు ఆర్థిక సాయంతో పాటు వారిని ఐఎఎస్, ఐపిఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా కాపు సామాజిక వర్గం మొత్తం టిడిపి వెంటే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాపుల మద్దతుతో పార్టీ పెట్టి నడపలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 2004 ఎన్నికలకు ముందు కాపులను బిసిలుగా గుర్తిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరంజీవి, కాపు జాతి గౌరవాన్ని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.