ఆంధ్రప్రదేశ్‌

జగన్ నివాస సమీపంలో పేలుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసం సమీపంలో పేలుడు సంభవించింది. ఆదివారం వేకువఝామున జరిగిన ఈ ఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఉరుకులు, పరుగులు తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగిన ఇంటి తలుపులు, ఇనుప గేట్లు విరిగిపడ్డాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లో ముఖ్యమంత్రి నివాసానికి కొద్దిదూరంలోనే జరిగిన పేలుళ్ల శబ్దానికి స్థానికులు ఆందోళనతో వీధిలోకి చేరారు. సీఎం జగన్ నివాసానికి చేరువలో ఉన్న ఓ ఇంటిలో ఫ్రిజ్ నుంచి
గ్యాస్ లీక్ కావటం వల్ల పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో నివసిస్తున్న పైడమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీస్ అకారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన పైడమ్మను కూడా ప్రశ్నిస్తున్నారు. భారీగా పేలుడు శబ్దం రావటంతో గ్యాస్ లీకైందా, లేదా మరేదైనా జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఫ్రిజ్ నుంచి గ్యాస్ లీకైతే అంత పెద్ద శబ్దం రాదని కూడా అంటున్నారు. స్థానికుల నుంచి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.