ఆంధ్రప్రదేశ్‌

విద్యా రంగంలో సంస్కరణల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యాశాఖలో జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ రెండు కీలకమైన విభాగాల మధ్య సమన్వయలోపం ఏర్పడటం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడంతో దీనిని చక్కదిద్దేందుకు సంస్కరణలు చేపట్టారు. వాటిలో ముందుగా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి హోదాను ఇకనుంచి అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త(ఏపీసీ)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు 2002లో రాజీవ్ విద్యామిషన్‌ను ఏర్పాటుచేశారు. తరువాత దానిని సర్వశిక్ష అభియాన్ పేరిట మార్పు చేసింది. ఆ శాఖద్వారా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. పాఠశాలలకు వౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయులకు శిక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టేది. వీటి పర్యవేక్షణ కోసం అన్ని జిల్లాల్లో ప్రాజెక్టు అధికారులను నియమించింది. ప్రాథమిక విద్య అభివృద్ధికి ఎస్‌ఎస్‌ఏ చేపట్టే కార్యక్రమాల రూపకల్పన చేయగా, వాటిని డిఇఒ ఆధ్వర్యంలో అమలు చేసేవారు. ఆర్‌ఎంఎస్‌ఎ ద్వారా ఉపాధ్యాయులకు డిఇఒ పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగా, ఎస్‌ఎస్‌ఏ ద్వారా పీవో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించేవారు. దీంతో ఈ గందరగోళ పరిస్ధితిపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏ పీవో హోదాను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఇకనుంచి సర్వశిక్ష అభియాన్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇకపై డిఇఒ పర్యవేక్షణలోనే జరగనున్నాయి. ఇక నుంచి విద్యాశాఖకు సంబంధించిన వ్యక్తిని మాత్రమే ఏపీసీ (అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త)గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఈ పోస్టుకు ఇతర శాఖలకు చెందిన అధికారులు పైరవీలు చేసుకుంటూ డిప్యుటేషన్‌పై ఈ శాఖకు వచ్చేవారు. నిధులు పెద్ద మొత్తంలో ఉండటంతో ఈ శాఖ పట్ల మక్కువ ఉండేది. కాగా, ప్రస్తుత పీవోలను ఎక్కడకు పంపాలనే విషయమై ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. త్వరలోనే వీటిపై పూర్తిస్ధాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.