ఆంధ్రప్రదేశ్‌

రివర్స్ టెండరింగ్‌తో అవినీతిపరుల ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం వల్ల అవినీతిపరుల ఆట కట్టించామని, అదేవిధంగా వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృథా కాకుండా కాపాడగలిగామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పెన్నా నది నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు.
అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు తమ అనుచరులకు ప్రాజెక్టుల పనులను అడ్డగోలుగా కట్టబెట్టారని విమర్శించారు. తద్వారా వేల కోట్ల రూపాయలు అవినీతిపరుల జేబులు నింపే ప్రయత్నాన్ని నాటి ప్రభుత్వం చేసిందని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిపాలన పారదర్శకతతో వ్యవహరించడం వల్ల రివర్స్ టెండరింగ్‌కు పిలిచి ఈ ప్రాజెక్టుల మీద దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని కాపాడగలిగామని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు కాలువల నిర్వహణ కోసం నామినేషన్ పద్ధతిలో తన అనుచరులకు కట్టబెట్టారని అన్నారు. కానీ తాము అలాచేయకుండా నిజాయితీగా టెండర్లను పిలిచి ఇచ్చామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 105 కాలువలను ఇదే పద్ధతిలో ఇచ్చామని ఆయన వివరించారు. జగన్మోహన్‌రెడ్డి నిజాయితీ పాలన టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.
చంద్రబాబునాయుడు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోందని, దీంతో టీడీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతం వరకు గడచిన ఐదు నెలల్లోనే పూర్తిచేయగలిగామన్నారు.

*చిత్రం...విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్