ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్, పర్యాటక సెల్‌కు ప్రత్యేకాధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు ఆలిండియా సర్వీసు అధికారుల కోసం తాత్కాలికంగా రెండు పోస్టులు సృష్టించి వాటిలో కొనసాగిందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ విద్య, ఏపీ భవన్‌లోని పర్యాటక సెల్‌కు ప్రత్యేకాధికారులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. రైల్వే బోర్డులో పని చేస్తున్న ఎన్.వి రమణా రెడ్డి (ఐఆర్‌పీస్) డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పర్యాటక సెల్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ భవన్‌లో నాన్-క్యాడర్ పోస్టు లేదని రెసిడెంట్ కమిషనర్ తెలియచేయడంతో తాత్కాలికంగా అక్కడ స్పెషల్ ఆఫీసర్ పోస్టును ఏర్పాటు చేసి, అందులోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డులో పని చేస్తున్న వి.రామకృష్ణ (ఐఆర్‌ఎస్) కూడా రాష్ట్రానికి డెప్యూటేషన్‌పై వచ్చారు. ఇంటర్మీడియట్ విద్య స్పెషల్ కమిషనర్‌గా సెప్టెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. ఇంటర్మీడియట్ విద్యలో నాన్-క్యాడర్ పోస్టు లేనందున తాత్కాలికంగా స్పెషల్ కమిషనర్ పోస్టు సృష్టించి నియామకం చేపట్టారు. ఈ మేరకు వేర్వేరు ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు.