ఆంధ్రప్రదేశ్‌

రివర్స్ టెండరింగ్‌తో రూ.1000 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 21: రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యిందని, ఇదే స్ఫూర్తిని త్వరలో మున్సిపల్, హౌసింగ్ శాఖల్లో సైతం కొనసాగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులను పారదర్శకంగా పూర్తిచేస్తామని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతి పని పారదర్శకంగా జరగాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు రివర్స్ టెండరింగ్‌కు వెళుతున్నామన్నారు. ఇప్పటికే 1000 కోట్లు ఆదా కాగా రానున్న రోజుల్లో మరో 500 కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశాలున్నాయన్నారు. అన్నిశాఖల్లో కలిపి సుమారు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఆదా కానున్నాయని తెలిపారు. గతంలో టెండర్లలో నిబంధనలు పెట్టి వాళ్ల మనుషులకే వచ్చేలా చేసుకునే వారని ఆరోపించారు. ఏ టెండర్ చూసినా ఎక్సెస్‌కు కోట్ చేసుకుని వారికే వచ్చేలా చేసుకున్నారనేది స్పష్టమవుతోందన్నారు. జలయజ్ఞంలో దివంగత వైఎస్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెలిగొండకు సంబంధించి రూ.500 కోట్ల టెండర్‌పై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని, దీంతో ప్రభుత్వానికి రూ.62 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. మూడు నెలల కాలంలోనే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇరిగేషన్ శాఖలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల ఆదా జరిగిందని తెలిపారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకుండా ఉంటే ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లేవో అన్నారు. వీటి ద్వారా సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకు చేరువ చేయవచ్చని పేర్కొన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టూ చేపట్టిన దాఖలాలు లేవని మంత్రి అనిల్ విమర్శించారు.