ఆంధ్రప్రదేశ్‌

ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో ప్రతి పైసాకు జవాబుదారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 21: గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కేటాయిస్తున్న సబ్‌ప్లాన్ నిధుల్లో ప్రతి పైసాకు జవాబుదారీగా వ్యవహరించి వారి అభివృద్ధికే నిధులు వెచ్చిస్తామని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. 45 శాఖలతో గిరిజన ఉప ప్రణాళిక నిధుల కేటాయింపు ఆయా శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నదీ తెలుసుకునేందుకు ఆయా శాఖాధిపతులతో సోమవారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో గిరిజన ఉప ప్రణాళికకు రూ. 4988 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే రూ. 812 కోట్లు అదనమని వివరించారు. నోడల్ ఏజెన్సీ ఆమోదించిన తరువాతే ఆయా శాఖలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయాలని సూచించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులను పూర్తిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలకే వినియోగించాలని ఆపై మైదాన ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని దిశానిర్దేశం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి శాఖాధిపతులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత సమీక్ష, ప్రస్తుత సమీక్ష మధ్య జరిగిన కార్యక్రమాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయింపులు పారదర్శకంగా ఖర్చు చేస్తామని పునరుద్ఘాటించారు.