ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌చార్జి మంత్రుల మార్పు తుగ్లక్ చర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల సమగ్ర స్వరూపం, సమస్యలను అర్థం చేసుకునేలోపే వారిని వేరే జిల్లాలకు మార్చడం రాష్ట్ర ప్రభుత్వ తుగ్లక్ చర్యగా పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
మూడున్నర నెలలకే 13 మందిలో ముగ్గురు మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరిత, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లను ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంలో ఏమైనా కారణం ఉందా? అని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ ముగ్గురు మంత్రులను ఎందుకు తప్పించినట్లు, వారు బాధ్యతలు సరిగా నిర్వహించడం లేదా అనే విషయం ప్రజలకు ముఖ్యమంత్రి వివరించాల్సి ఉందన్నారు. మిగతా 9మంది సక్రమంగా పనిచేసినట్లా, బాగా పనిచేస్తే మూడున్నర నెలలకే వారిని ఎందుకు ఇతర జిల్లాలకు బదిలీ చేశారో కూడా చెప్పాలన్నారు.