ఆంధ్రప్రదేశ్‌

టీడీపీని యువరక్తంతో నింపుతాం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: వైకాపా అధికారంలో ఉన్నప్పటికీ చిల్లర రాజకీయం చేస్తున్నదంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తమ హయాంలో అన్న క్యాంటీన్‌ల ద్వారా కేవలం రూ.5కే పేదలకు భోజనం పెడితే... ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేసి మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నదని సోమవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు విమర్శించారు. అభివృద్ధి... సంక్షేమంతో తాను నాడు పాలన అందిస్తే, నేడు అన్నింటిలో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇక టీడీపీని యువరక్తంతో నింపడం లక్ష్యంగా పార్టీ పదవుల్లో యువతకు 33శాతం, మహిళలకు 33శాతం కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ గ్రామస్థాయి నుంచి సమర్థవంతమైన నాయకత్వం ముందుకు రావాలన్నారు. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటాలు చేస్తూ కష్టాల్లో ఉన్న పేదలకు అండగా వుంటూ ప్రజల ఆశీస్సులు పొందాలన్నారు.