ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రగా మారుస్తున్న వైసీపీ: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పూర్తిగా వైఫల్యం చెందడమే కాక, రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా విమర్శించారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగ కార్మికులు వైసీపీ పాలనలో దొంగతనాలకు అలవాటు పడే పరిస్థితి కల్పించారన్నారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం తగదు: అశోక్‌బాబు
గుంటూరు: వైసీపీ ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం వీసీ దామోదర నాయుడు అరెస్ట్ జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ పి అశోక్‌బాబు విమర్శించారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దామోదర నాయుడు వీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్య, పాలనాపరంగా యూనివర్శిటీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, ఇవి నచ్చని కొందరు ఆయనపై కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.