ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లది ద్వంద్వ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: మహాత్మాగాంధీ 150 జయంతి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఈ తరానికి గాంధీని మళ్లీ పరిచయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సాకే శైలజానాథ్ వెల్లడించారు. సోమవారం విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది. అందులో భాగంగా ‘ముజే మే హీ గాంధీ’ (నాలో ఉన్నాడు గాంధీ) అనే కార్యక్రమాన్ని ఏఐసీసీ ఆదేశాల మేరకు రూపకల్పన చేసి విద్యార్థుల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు గాంధీ గూర్చి ఏవేవో అవాకులు చవాకులు పేలుతున్నారని, మరోకవైపు ప్రజ్ఞాసింగ్‌లాంటి ప్రజా ప్రతినిధులతో గాడ్సేని కీర్తింప చేస్తున్నారని ఈ సమావేశంలో శైలజానాథ్ దుయ్యబట్టారు. మరోవైపు ట్రంప్ లాంటి వారు ప్రధాని మోదీని జాతిపిత అని సంబోధిస్తే నోరు మెదపక చిరునవ్వులు చిందిస్తున్నారన్నారు. ఆనాడు బ్రిటేష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్య్ర సమరయోధులను, అమరవీరులను, దేశాన్ని నిలబెట్టిన వారి గురించి అవమానకరంగా మాట్లాడుతూ, ప్రవర్తిస్తున్న బీజేపీ తీరును కాంగ్రెస్ ఖండిస్తున్నదన్నారు. అండమాన్ జైల్లో ఉన్నప్పుడు సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణ కోరుతూ రాసిని లేఖను ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరిపై రాష్ట్రంలో ఒక్క పార్టీకూడా నోరు మెదపక పోవడం శోచయనీయమన్నారు. తెలంగాణ ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ బీ అనులేఖ మాట్లాడుతూ ఈ తరం విద్యార్థిలోకానికి గాంధీని పరిచయం చేయడమే ‘ముజే మే హీ గాంధీ’ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. ఈ తరం ఆలోచనల్లోకి గాంధీ మహాత్ముని తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ సంకల్పించిందన్నారు. ఈ నెల 25 నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విద్యార్థుల సమస్యలపై తాము యాత్రలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న నెల్లూరులో ప్రారంభమై నవంబర్ 10న విజయవాడలో ముగుస్తుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్, జిల్లా అధ్యక్షులు హర్షవర్ధన్, బాషా తదితరులు పాల్గొన్నారు.