రాష్ట్రీయం

ఏపీకి భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధ, గురువారాల్లోనూ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.