ఆంధ్రప్రదేశ్‌

గాంధీ అసలు వారసులం మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 22: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం భారతీయ జనతా పార్టీతోనే సాకారమవుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాంధీ ఆశయాలకు అద్దం పడుతూ వాటిని నెరవేరుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తామే గాంధీ అసలైన వారసులమని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో మంగళవారం గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లె పంచాయతీలోని బీజేపీ కొట్టాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర 7 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో కన్నా మాట్లాడుతూ ఇప్పటి వరకూ గాంధీ పేరు వాడుకున్నారని, నకిలీ గాంధీలు, నకిలీ పార్టీలు పాలన సాగించి కాలయాపన చేశాయని ఆరోపించారు. అయినా గాంధీ ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. బీజేపీ గ్రామాభివృద్ధికి కృషి చేస్తోందని, చిట్టచివరి వ్యక్తి వరకూ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గాంధీ కోరిన స్వచ్ఛ భారత్‌ను బీజేపీ అమలు చేయబోతే రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, కానీ మోదీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ భారత్‌కు అర్థం చెప్పామన్నారు. అలాగే బ్యాంకుల్లో 35 కోట్ల జన్‌ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్‌తో ప్రారంభించిన ఘనత బీజేపీదేనన్నారు. గాంధీ ప్రారంభించిన సర్వోదయ ఉద్యమం స్ఫూర్తితోనే బీజేపీ అంత్యోదయ పథకం అమలు చేస్తోందన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం అస్తవ్యస్థ నిర్ణయాలతో పాలన గందరగోళంగా మారిందని విమర్శించారు. ప్లాస్టిక్ వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, ప్రజలందరూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గాంధీ సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈనెల 31 వరకూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. బుధవారం కడప జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కన్నా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
*చిత్రం... అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో మంగళవారం నిర్వహించిన గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు