ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: అల్పపీడనం ప్రభావంతో సోమవారం అర్థరాత్రి నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం రెండు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి వరకు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ఎడతెగని వర్షాలకు నానిన పూరిళ్లు నేలకొరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగాపువారిపేటలో రెండు పూరిళ్ళు నేలకొరిగాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ఛిద్రమైన రహదారుల పరిస్థితి మరింత దిగజారింది. పలు ప్రధాన రహదారులపై భారీగా ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు చేరి, ఏది గొయ్యో తెలియని విధంగా తయారవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పలు మండలాల్లో భారీ వర్షానికి వరిచేలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో చేలల్లోకి నీరుచేరింది. ప్రస్తుతం వరి చేలు పాలుపోసుకునే దశలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో నేలకొరగడంతో గింజ సరిగా తయారుకాక, తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.
*చిత్రం... తూ.గో. జిల్లా కోనసీమలో మునిగిన వరి చేను