ఆంధ్రప్రదేశ్‌

ఇసుకపై రాజకీయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 22: రాష్ట్రంలో గత రెండు నెలలుగా వర్షాలు కురుస్తూ వరదలు తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఇసుక కొరత ఏర్పడితే దాన్ని రాజకీయం చేయటం ప్రతిపక్ష పార్టీలకు తగదని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్‌శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నూతన ఇసుక విధానం ద్వారా నిత్యం 45 వేల టన్నులు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదుల్లో వరదల కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని దీనివల్ల రీచ్‌ల నుంచి ఇసుకను తరలించే అవకాశం లేదన్నారు. ఇసుక కొరత వల్ల నిర్మాణ పనులు మందగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పట్టా భూముల ద్వారా ఇసుక సరఫరాకు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇసుకను ఇప్పటికే అందిస్తున్నామని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి భంగం కలుగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నూతన విధానం వల్ల మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడిందనే అక్కసుతోనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై బురద చల్లుతోందని మండిపడ్డారు. నదుల్లోని ఇసుకను యథేచ్ఛగా దోచుకున్న టీడీపీ నేతలు అధికారం, ఆదాయం కోల్పోవటంతో రాజకీయ లబ్ధి కోసం సమస్య లేవనెత్తుతున్నారని ధ్వజమెత్తారు. గత పదేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయాయని,
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుంటే ప్రతిపక్షాలకు మింగుడు పడటంలేదని విమర్శించారు. తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక మేట వేసిందన్నారు. రాష్ట్రం మొత్తంగా ఏటా రెండు కోట్ల టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారని మరో ఐదేళ్లకు సరిపోను నిల్వలు నదుల్లో ఉన్నాయని వివరించారు. ఇప్పటికే 1295 మంది బల్క్ కన్సూమర్లకు ఐదు లక్షల టన్నుల ఇసుక అందించామని మరో 15 రోజుల్లో వరదలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నందున తగినంత వినియోగదారులకు అందిస్తామని వెల్లడించారు. క్రెడాయి, రియల్ ఎస్టేట్ అసోసియేషన్లతో సంప్రతింపులు జరిపి 50వేల టన్నులు ఇసుకను సరఫరా చేయించామని తెలిపారు. నిర్మాణరంగ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి వారి అవసరాలకు అనుగుణంగా ఎంత వరకు రవాణా చేయవచ్చనే విషయమై ఓ అవగాహనకు వచ్చామన్నారు. పట్ట్భాముల్లో మేటవేసిన ఇసుకను తొలగించేందుకు టన్నుకు రూ. 100 చొప్పున చెల్లిస్తామని భూ యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇసుకకు ప్రత్యామ్నాయంగా కంకర నుంచి తయారుచేసే ఎంశాండ్ యూనిట్లకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మెటల్ క్వారీల్లో ఎంశాండ్ యూనిట్లు నెలకొల్పే వారికి పావలా వడ్డీకే రుణాలు అందించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సమావేశంలో మైనింగ్‌శాఖ కార్యదర్శి రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్‌శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి