రాష్ట్రీయం

నేనెక్కడికీ పారిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం: నేనెక్కడికీ పోలేదు.. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానంటూ కల్కి భగవాన్ మంగళవారం ఆశ్రమానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కల్కి ఆశ్రమంలో ఆదాయపు పన్ను అధికారులు జరిపిన సోదాలు, మీడియాలో వచ్చిన కథనాలపై కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమంపై ఆదాయపు పన్ను శాఖాధికారులు జరిపిన సోదాను ఐటీ విభాగం జరిపే సాధారణ విధులలో ఒక భాగం అన్నారు. అయితే మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా కథనాలు రావడం బాధాకరమన్నారు. అయితే మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా భక్తులు మాత్రం తమకు అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తమకు ఎంతో సంతోషాన్నిచ్చాయన్నారు. తాను దేశం వదలి ఎక్కడికీ వెళ్లలేదన్నారు. తాను తిరువళ్లూరు సమీపంలో ఉన్న నేమం కల్కి ఆశ్రమంలోనే ఉంటున్నానని తెలియజేశారు. నేమంలోని కల్కి ఆశ్రమంలో ముక్తి, మోక్షం తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. వీటి పర్యవేక్షణలో భాగంగానే తాను అక్కడ ఉంటున్నానన్నారు. అయితే మీడియాలో మాత్రం తాను కనబడటం లేదని, దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా ప్రచారాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కల్కి ఆశ్రమం ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఎప్పుడు ఎవ్వరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఆ సమయాల్లో భక్తుల మనసుల్లో తాము మరింత గొప్ప స్థానాన్ని పొందుతున్నామే తప్ప వెనకబడటం లేదన్న విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలన్నారు. భవిష్యత్‌లో కూడా ఆశ్రమ కార్యక్రమాలు అన్ని ప్రాంతాలలోనూ యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఆశ్రమంపై వస్తున్న అసత్య ప్రచారాలను భక్తులు నమ్మాల్సిన అవసరం లేదని, భక్తులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఆయన తెలిపారు.

*చిత్రం... కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్