ఆంధ్రప్రదేశ్‌

దివ్యాంగులకు స్మార్ట్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు (వికలాంగులకు) యూనిక్ డిజెబులిటీ గుర్తింపు (యూడీఐడీ) స్మార్ట్ కార్డులు త్వరలో మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ విషయమై మంగళవారం సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా అర్హులైన విభిన్న ప్రతిభావంతులను గుర్తించి వారికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల భాగస్వామ్యంతో సకాలంలో సర్ట్ఫికెట్లు జారీచేసిన అనంతరం యూడీఐడీ కార్డులు మంజూరు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే సదరమ్ సర్ట్ఫికెట్లు పొందిన వారి వివరాలు, సెర్ప్ వద్ద ఉన్న డేటాను నేరుగా యూడీఐడీ కార్డులు మంజూరుచేసే కేంద్ర సంస్థకు పంపాలని సూచించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు వైద్య, పంచాయతీరాజ్‌శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని విభిన్న, స్ర్తి, శిశు ప్రతిభావంతుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతిని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఇప్పటి వరకు 13 జిల్లాల్లో వికలాంగులకు సదరమ్ సర్ట్ఫికెట్ల జారీకి 13లక్షల 35వేల 493 దరఖాస్తులు స్వీకరించి 10లక్షల 78వేల 70 దరఖాస్తుదారులకు 87.26శాతం అంగవైకల్య నిర్ధారణ జరిగిందని, అందులో 8లక్షల 48వేల 422 మందికి సదరమ్ సర్ట్ఫికెట్లు జారీ చేశారని దమయంతి వివరించారు. వాటిలో 5 లక్షల సర్ట్ఫికెట్ల డేటాను యూడీఐడీకి పంపామని మరో 4 లక్షల
మంది డేటాను బదలాయించాల్సి ఉందన్నారు. గత ఏడాది ఆగస్టు 3 నుండి అక్టోబర్ 20 వరకు డిజిటల్ సర్ట్ఫికెట్ల జారీకై మీ సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక స్లాట్లను కేటాయించగా 80వేల 995 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 57వేల 662 మందికి సర్ట్ఫికెట్లు జారీ చేశారని చెప్పారు. యూడీఐడీ కార్డులకు సంబంధించి ఇప్పటికే జోన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఈ-ప్రగతి బృందం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు స్వావలంబన కార్డు పేరిట క్రిడెట్, డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూనివర్సల్ యూడీఐడీ కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్డు పొందితే అంగవైకల్యానికి సంబంధించిన ఇతర వివరాలతో సర్ట్ఫికెట్లను తీసుకువెళ్లే ప్రయాస ఉండదన్నారు. ప్రస్తుతం వికలాంగులకు ఒక రాష్ట్రంలో మంజూరు చేసిన సర్ట్ఫికెట్ మరో రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే పరిస్థితులు లేవని, అయితే కొత్తగా జారీ చేయనున్న యూడీఐడీ కార్డులను దేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఆమోదిస్తారని వివరించారు. దేశవ్యాప్తంగా రైల్వే, విద్యా సంబంధిత సేవలను సులువుగా పొందవచ్చన్నారు. ఈ కార్డు ద్వారా వికలాంగుల అంగవైకల్యం వివరాలను కార్డు రీడర్ డివైస్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. ఒకసారి నమోదైతే మరోసారి డూప్లికేట్ అవ్వకుండా యూనిక్‌నెస్ ఈ కార్డులకు ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కార్డుదారులకు ఏ విధంగా అందుతున్నదీ తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ దుర్గాప్రసాద్, వికలాంగుల సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ జీసీ కిషోర్‌కుమార్, సెర్ప్ సీఈఒ రాజబాబు, కేంద్ర కన్సల్టెంట్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... దివ్యాంగుల స్మార్ట్‌కార్డులపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం