ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంపై త్వరలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: విజయనగరం జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను ఎక్కడ నిర్మించాలనే అంశంపై త్వరలో ప్రభుత్వం ప్రకటించనుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్ర ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న రెండు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 40 ఎకరాల స్థలం అవసరం కాగా, 35 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అన్నారు. జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఐదు ఎకరాల స్థలం, పోలీస్ బ్యారెక్స్‌కు అనుబంధంగా ఉన్న పోలీసు అతిథి గృహాలు ఉన్న ఐదెకరాల స్థలం, ఉడా కాలనీలోని దేవాదాయశాఖ స్థలాలు కలుపుకుంటే 35 ఎకరాల స్థలం అందుబాటులో ఉందన్నారు. దేవాదాయశాఖ స్థలం సేకరించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియ గురించి మంత్రి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే బోధనాసుపత్రిగా కూడా ఉపయోగపడుతుందన్నారు. ఏడాదిన్నర కాలంలోనే బోధనా కళాశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారన్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ