ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల సంక్షేమానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 22: రాష్ట్రంలోని అర్చకులు, బ్రాహ్మణులకు మునుపెన్నడూ జరగని మేలు ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆ మేరకు చంద్రబాబు నాయుడు వినూత్న, సంక్షేమ పథకాలను అమలు చేశారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమానికి గండికొట్టే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 76ను విడుదల చేసే ముందు అర్చకత్వ నాయకులతో సంప్రదింపులు జరపగా, కొంతమంది నాడు జీవో విడుదల కాకుండా అడ్డుపడిన వారే నేడు అదే జీవో విడుదల తమ ఘనతగా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.