ఆంధ్రప్రదేశ్‌

రాజధానిపై అపోహలు సృష్టిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, అక్టోబర్ 22: రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం అపోహలు సృష్టిస్తోందని గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ విమర్శించారు. మంగళవారం ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నాయకులతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ ప్రాంగణాన్ని సందర్శించి పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో జయదేవ్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు నెలలుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పోకడ దారుణంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ పాలనలోను ఇటువంటివి చూడలేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలోను ఇంతటి అరాచకం చూడలేదని అన్నారు. రాజధానిలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి రహదారుల నిర్మాణం జరిగిందని, రాజధాని మారుతుందంటూ అపోహలు సృష్టిస్తున్న మంత్రులు వేల కోట్లతో నిర్మించిన రహదారులను ఏం చేస్తారని ప్రశ్నించారు. 2022 నాటికి జమిలి ఎన్నికలు రావటం దాదాపు ఖాయమని, టీడీపీని గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు 2021 నుంచే సిద్ధం కావాలని ఎంపీ జయదేవ్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, టీడీపీ నేతలు కార్యకర్తలపై వేధింపులకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.