ఆంధ్రప్రదేశ్‌

ఇకనైనా తీరు మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 22: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి మైండ్‌లో చిప్ పాడైపోయిందని, అందుకే నోటికొచ్చినట్లు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఓటమి చెందాక రాష్ట్రానికి పట్టిన పీడ పోయిందని ప్రజలందరూ భావిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో కరవు పోయి వరుణదేవుడి కరుణతో వర్షాలు సమృద్ధిగా కురిసి డ్యామ్‌లన్నీ నిండుతున్నాయన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో గడికోట మాట్లాడుతూ చంద్రబాబు భాషలో హుందాతనం లోపించిందని, దిగజారుడు విమర్శలు చేస్తూ, ప్రజలను ప్రాంతాల వారీగా అవమానిస్తున్నారని, ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజల ఆగ్రహానికి గురికావటం ఖాయమన్నారు. నోరు తెరిస్తే పులివెందుల పంచాయితీ, రాయలసీమ రౌడీయిజం అంటున్నారని, మీరూ రాయలసీమ వాసేనని, మీకు ఓట్లు వేయనంతమాత్రాన రెచ్చగొట్టే విధంగా, ప్రజల పట్ల హేళనభావంతో మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పిన విధంగా రైతు పెట్టుబడి నిధిని ఖాతాల్లో జమ చేశారని, ఆటోడ్రైవర్లు, అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో పాటు బడుగు, బలహీన వర్గాలకూ ఇదే తరహాలో ఆదుకుంటున్న ఘనత వైసీపీదన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సలహాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రిని దూషిస్తూ, డీజీపీని ఖబడ్దార్ అంటూ పేర్కొనడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, శాంతిభద్రతలు ఉండకూడదు, అభివృద్ధి జరగకూడదని భావిస్తున్న చంద్రబాబుకి 23 సీట్లు ఎందుకిచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. ఒక్క నెలలోనే పోలవరం, ఇతర ప్రాజెక్టులలో 1000 కోట్ల రూపాయలు ఆదా చేశామని, ఇది కేవలం రివర్స్ టెండరింగ్ ద్వారానే సాధ్యపడిందని తెలిపారు. కాగా రాష్ట్ర అభివృద్ధి అంశాలపై మాత్రమే ముఖ్యమంత్రి జగన్ అమిత్‌షా, రవిశంకర ప్రసాద్, ఇతర కేంద్రమంత్రులు, అధికారులను కలుస్తారని వివరించారు.